Breaking News

వావ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్‌

Published on Thu, 12/04/2025 - 18:52

బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక అద్భుతం చేశాడు. మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలాండ్ లాంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం కారీ స్టంప్స్‌కు దగ్గరలో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు.

స్టంప్స్‌కు దగ్గరలో నిలబడే బౌన్సర్లను సైతం అతడు అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో క్యారీ అందుకున్న ఓ క్యాచ్ తొలి రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. 

కారీ సంచలన క్యాచ్‌..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్‌.. నాలుగో బంతిని గాస్ అట్కిన్సన్స్‌కు లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. అట్కిన్స‌న్ ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. బంతి కీపర్ వెనుకకు వెళ్లగా క్యాచ్ అందుకోవడానికి కారీ, మార్నస్ లబుషేన్ ఇద్దరూ ప‌రిగెత్తారు. అందుకోసం ఇద్ద‌రు కూడా డైవ్ చేశారు. 

అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగ‌లిగాడు. లబుషేన్ అత‌డిని  ఢీకొన్నప్పటికీ కారీ మాత్రం బంతిని విడిచిపెట్ట‌లేదు. అత‌డి క్యాచ్‌ను చూసి ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌క్క‌న ఉన్న ల‌బుషేన్ సైతం కారీ హ‌త్తుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి నెటిజన్లు కొనియాడుతున్నారు.

రూట్‌ సెంచరీ..
ఈ యాషెస్‌ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ విరోచిత సెంచరీతో చెలరేగాడు. ఆసీస్‌ గడ్డపై రూట్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌(135), ఆర్చర్‌(32 నాటౌట్‌) ఉన్నాడు. మరోవైపు ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్‌


 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)