Breaking News

#Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా

Published on Wed, 05/24/2023 - 23:47

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వికెట్లతో చెలరేగి లక్నో వెన్నులో వణుకు పుట్టించిన ఆకాశ్‌ మధ్వాల్‌ ఇవాళ్టి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ మధ్వాల్‌  లక్నోపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌ చరిత్రలో 5 పరుగులకే ఐదు వికెట్లు తీసి అత్యంత బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన రెండో బౌలర్‌గా ఆకాశ్‌ మధ్వాల్‌ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజం అనిల్‌ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 2009లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున కుంబ్లే ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. 

ఇక ముంబై ఇండియన్స్‌ తరపున బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన ఆటగాడిగా ఆకాశ్‌ మద్వాల్‌ నిలిచాడు. ఇంతకముందు లసిత్‌ మలింగ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం అత్యుత్తమంగా ఉంది.

ఇక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ నమోదు చేసిన జాబితాలో ఆకాశ్‌ మధ్వాల్‌ తొలి స్థానంలో నిలిచాడు.  ఆకాశ్‌ తర్వాత అంకిత్‌ రాజ్‌పుత్‌- KXIP..(5/14 Vs SRH, 2018), వరుణ్‌ చక్రవర్తి-కేకేఆర్‌(5/20 Vs DC, 2020), ఉమ్రాన్‌ మాలిక్‌-ఎస్‌ఆర్‌హెచ్‌(5/25 Vs GT, 2022) ఉన్నారు.

చదవండి: పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)