Breaking News

ఇషాన్‌ కిషన్‌ సేనకు భారీ షాక్‌.. టీమిండియా స్టార్‌ ఆటగాడు దూరం

Published on Wed, 08/13/2025 - 12:29

దులీప్‌ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్‌ కిషన్‌ నేతృత్వం వహిస్తున్న ఈస్ట్‌ జోన్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. కీలక పేసర్‌ ఆకాశ్‌దీప్‌ జట్టు నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏమో తెలీదు కాని, ఆకాశ్‌దీప్‌ స్థానంలో అస్సాం మీడియం పేసర్‌ ముక్తర్‌ హుసేన్‌ జట్టులోకి వచ్చాడు. ఎన్‌సీఏ ఆకాశ్‌దీప్‌ను విశ్రాంతి తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు పీటీఐ చెబుతుంది.

ఆకాశ్‌దీప్‌ కొద్ది రోజుల కిందట ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్‌ జోన్‌ జట్టులో ఉన్నాడు. అతను టీమిండియా పేసర్లు మహ్మద్‌ షమీ, ముకేశ్‌ కుమార్‌లతో కలిసి బంతిని పంచుకోవాల్సి ఉండింది. అయితే అతను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించబడ్డాడు.

ఆకాశ్‌దీప్‌ తాజాగా ముగిసిన ఇంగ్లండ్‌ పర్యటనలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. టీమిండియా గెలిచిన బర్మింగ్హమ్‌ టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శన సహా ఓవల్‌ టెస్ట్‌లో నైట్‌ వాచ్‌మన్‌గా కీలకమైన హాఫ్‌ సెంచరీ చేశాడు.

కాగా, ఈస్ట్‌ జోన్‌ జట్టుకు టీమిండియా ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడి​కి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) అభిమన్యు ఈశ్వరన్‌ ఎంపికయ్యాడు. జట్టులో విధ్వంసకర ఆటగాడు రియాన్‌ పరాగ్‌ చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

దులీప్‌ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ముక్తార్‌ హుసేన్‌, మొహమ్మద్‌  షమీ

స్టాండ్‌బై ప్లేయర్‌లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్ 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)