Breaking News

'అదే హార్దిక్‌ కొంపముంచింది'.. అగార్కర్ అస్సలు ఒప్పుకోలేదంట!?

Published on Sun, 07/21/2024 - 12:06

టీమిండియా నూత‌న టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాద‌వ్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. టీ20ల్లో రోహిత్ శ‌ర్మ వారుసుడిగా సూర్య‌కుమార్ భార‌త జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నాడు. శ్రీలంక‌తో టీ20 సిరీస్ నుంచి భార‌త ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా సూర్య ప్ర‌స్ధానం మొద‌లు కానుంది. 

అయితే హార్దిక్ పాండ్యాను కాద‌ని సూర్య‌కుమార్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌లోనూ, భార‌త జ‌ట్టు త‌త్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న‌ప్ప‌ట‌కి కెప్టెన్‌గా పాండ్యాను ఎంపిక చేయ‌లేద‌న్నది అంద‌రి మెద‌డ‌ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌.

ఇందుకు ఒక్కొక్క‌రు ఒక్క కార‌ణం చెబుతున్నారు. కొంత మంది ఫిట్‌నెస్ వాళ్లే అత‌డిని ఎంపిక చేయ‌లేద‌ని, మ‌రికొంత మంది శ్రీలంక‌తో వ‌న్డేల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతోనే పాండ్యాకు జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌గించ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి కూడా పాండ్యాను త‌ప్పించ‌డం అంద‌రని విస్మ‌యానికి గురిచేసింది.

ఒప్పుకోని  అగార్కర్‌..
కాగా హార్దిక్ పాండ్యాకు భార‌త జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్  ఒప్పుకోలేదంట‌. పాండ్యా కెప్టెన్సీపై త‌నకు న‌మ్మ‌కం లేదంటూ అగార్క‌ర్ బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. 

అందుకు ఐపీఎల్‌లో పాండ్యా కెప్టెన్సీనే కార‌ణ‌మ‌ని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. పాండ్యా ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను వ‌రుస‌గా  రెండు సార్లు ఫైన‌ల్‌కు చేర్చిన‌ప్ప‌ట‌కి..  ముంబై ఇండియన్స్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టాక త‌న మార్క్‌ను మాత్రం చూపించ‌లేక‌పోయాడు. 

ఐపీఎల్‌-2024లో అత‌డి సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. వ‌రుస ఓట‌ములతో లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం ప‌ట్టింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

ఈ క్ర‌మంలో అగార్కర్ అండ్‌ కో సైతం పాం‍డ్యా కెప్టెన్సీ స్కిల్స్‌పై  సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి.  మరోవైపు భారత కొత్త హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపినట్లు తెలుస్తోంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)