Breaking News

రహానే స్థాయిని అమాంతం పెంచిన టాప్‌-5 ఇన్నింగ్స్‌లు!

Published on Thu, 07/30/2026 - 19:03

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్ అజింక్య ర‌హానే గురువారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. 90వ ద‌శకం నుంచి 2010 వ‌ర‌కు స‌చిన్‌, ద్ర‌విడ్‌, ల‌క్ష్మ‌ణ్, గంగూలీ త‌రం భార‌త టెస్టు క్రికెట్‌ను నిల‌బెట్టారు. ఆ త‌ర్వాత వీరి లెగ‌సీని కోహ్లి, రోహిత్‌, ర‌హానే, పుజారాలు విజ‌య‌వంతంగా కొన‌సాగించారు. 

ద్ర‌విడ్ త‌ర్వాత అజింక్య ర‌హానే భార‌త్‌కు ఎన్నో ఇన్నింగ్స్‌లో ఆప‌ద్భాంద‌వుడి పాత్ర‌ను పోషించాడు. వ‌న్డేలు, టెస్టుల్లో ఎన్నో మైలురాయి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే వాటిలో ఒక‌ ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం ర‌హానే స్థాయిని అమాంతం పెంచేశాయి. ర‌హానే టాప్‌-5 బెస్ట్ ఇన్నింగ్స్‌ల‌పై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

👉112 ప‌రుగులు(2020 మెల్‌బోర్న్‌ టెస్టులో, ఆసీస్‌పై)


Photo Credit: BCCI Twitter

అజింక్య ర‌హానే కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్‌కు మెల్‌బోర్న్ వేదిక‌గా నిలిచింది. అప్ప‌టికే అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ (డే అండ్ నైట్‌) టెస్టులో 36 ప‌రుగుల‌కే ఆలౌటై టీమిండియా ప‌రువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ త‌ర్వాత కోహ్లి కూడా త‌న కూతురు తొలి బ‌ర్త్‌డే కోస‌మ‌ని ఇండియాకు వెళ్లిపోయాడు. దీంతో ర‌హానే కెప్టెన్సీ బాధ్య‌త‌ను తీసుకున్నాడు. 

తొలి టెస్టులో ఘోర ఓట‌మితో పూర్తి ఒత్తిడిలో మునిగిపోయిన టీమిండియాను త‌న కెప్టెన్సీతో పూర్తిగా మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎంతో ఓపిక‌గా ఆడిన ర‌హానే 223 బంతుల్లో 112 ప‌రుగుల వీరోచిత సెంచ‌రీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యం సాధించ‌డ‌మే కాదు ఆ త‌ర్వాత సిరీస్‌ను కూడా 2-1తో గెలుచుకొని ర‌హానే సార‌థ్యంలో చారిత్రక విజ‌యాన్ని అందుకుంది.

👉103 ప‌రుగులు (లార్డ్స్ టెస్ట్, 2014లో ఇంగ్లండ్‌పై)


Photo Credit: BCCI Twitter

మెల్‌బోర్న్ వేదిక‌గా సాధించిన సెంచ‌రీ కంటే ముందు, ఆరేళ్ల క్రిత‌మే లార్డ్స్ గ‌డ్డ‌పై ర‌హానే మ‌రో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మెల్‌బోర్న్ లేక‌పోయుంటే లార్డ్స్‌దే ర‌హానే కెరీర్‌లో అత్యుత్త‌మ ఇన్నింగ్స్ అని బ‌ల్ల‌గుద్ది చెప్పొచ్చు. మెల్‌బోర్న్ టెస్టుకు ఏమాత్రం తీసిపోని లార్డ్స్ టెస్టులో 154 బంతుల్లో 103 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

జేమ్స్ అండ‌ర్స‌న్ బంతితో నిప్పులు చెరుగుతున్న వేళ భార‌త టాప్ బ్యాట‌ర్లంతా ఒక్కొక్క‌రుగా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. కానీ ర‌హానే మాత్రం ఓపిక‌ను ప్ర‌ద‌ర్శిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ (36) తన కెరీర్ అత్య‌ధిక స్కోరు సాధించ‌డం విశేషం.అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యం సాధించడంతో ర‌హానే ఇన్నింగ్స్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది.

👉ఢిల్లీ  టెస్టులో రెండు సెంచ‌రీలు (2015లో సౌతాఫ్రికాపై)


Photo Credit: BCCI Twitter

2015లో సౌతాఫ్రికా జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించింది. ఢిల్లీ వేదిక‌గా ఇరుజ‌ట్లు నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాయి. స్పిన్న‌ర్ల‌కు విప‌రీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై ర‌హానే రెండు సెంచ‌రీలతో చెల‌రేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 127 ప‌రుగులు సాధించిన ర‌హానే.. రెండో ఇన్నింగ్స్‌లో  కోహ్లితో క‌లిసి మ్యాచ్ విన్నింగ్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ప‌నిలో ప‌నిగా అజేయ సెంచ‌రీ (100 నాటౌట్‌) సాధించిన ర‌హానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ర‌హానే సిరీస్ మొత్తంలో రెండు దేశాల త‌ర‌ఫున సెంచ‌రీలు సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా ర‌హానే నిలవ‌డం విశేషం.

👉79 ప‌రుగులు (2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, సౌతాఫ్రికాపై)


Photo Credit: BCCI Twitter

కెరీర్ ఆరంభంలో వ‌రుస‌గా వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన ర‌హానే ఆ త‌ర్వాత టెస్టుల‌కే ఎక్కువ‌గా ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సౌతాఫ్రికాపై ఆడిన 79 ప‌రుగుల ఇన్నింగ్స్ మాత్రం టాప్‌-5లో ఒక‌టిగా నిలుస్తోంది. ఆ మ్యాచ్‌లో ర‌హానే 60 బంతుల్లోనే 79 ప‌రుగులు సాధించ‌డంతో టీమిండియా 300 ప‌రుగుల మార్క్‌ను దాటింది. మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓట‌మికి ప‌రోక్షంగా ర‌హానే ఆడిన ఇన్నింగ్స్ కార‌ణ‌మైంది.


👉39 బంతుల్లో 61 ప‌రుగులు (2011లో ఇంగ్లండ్‌పై టీ20 మ్యాచ్‌లో)


Photo Credit: BCCI Twitter

ర‌హానే అంటే క్లాస్ ఆట‌కు మారుపేరు అని ముద్ర ప‌డిన రోజుల్లో త‌న‌లో మాస్ యాంగిల్ ఉంద‌ని నిరూపించిన ఇన్నింగ్స్ ఇది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, టీ20 సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదిక‌గా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన ర‌హానే ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. 

39 బంతుల్లోనే 61 ప‌రుగులు చేసిన ర‌హానే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీ20ల్లో హాఫ్ సెంచ‌రీ సాధించిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఇవేగాక ర‌హానే బ్యాట్ నుంచి జాలువారిన అమోఘ‌మైన ఇన్నింగ్స్‌లు చాలానే ఉన్న‌ప్ప‌టికీ, మూడు ఫార్మాట్ల‌లో అత్యుత్త‌మ ఇన్నింగ్స్‌లను చూసుకుంటే ఈ ఐదు క‌చ్చితంగా టాప్‌లోనే ఉంటాయి.

చదవండి: పాకిస్తానీ కాదు.. ‘రియల్‌ పెద్ది’తోనే నీరజ్‌కు సవాల్‌! 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)