Breaking News

వారెవ్వా రహానే.. డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో! విండీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌

Published on Sun, 07/23/2023 - 12:33

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. మూడో రోజు ఆట ఫైనల్‌ సెషన్‌ తొలి ఓవర్‌ వేసేందుకు బంతిని జడ్డూ చేతికి రోహిత్‌ ఇచ్చాడు.

ఈ క్రమంలో 87 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో మూడో బంతిని బ్లాక్‌వుడ్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని మొదటి స్లిప్‌వైపు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రహానే డైవ్‌చేస్తూ ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూసిన విండీస్‌ బ్యాటర్‌ ఆశ్చర్యపోయాడు.

పిచ్‌ స్లో గా ఉన్నందన భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో రహానే తన అద్బుత క్యాచ్‌తో జట్టుకు కీలక వికెట్‌ను అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రహానేకు ఇది 102 టెస్టు మ్యాచ్‌ కావడం గమనార్హం.

ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల న‌ష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ జట్టు ఇంకా 209 పరుగుల వెనుక‌బ‌డి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్‌ (37) ఉన్నారు.  భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయ‌గా.. మహ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.


చదవండి: Roosh Kalaria: రిటైర్మెంట్‌ ప్రకటించిన ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)