Breaking News

ఇక గుడ్‌ బై.. అజింక్య ర‌హానే సంచ‌ల‌న నిర్ణ‌యం

Published on Thu, 08/21/2025 - 12:26

టీమిండియా వెట‌ర‌న్‌, ముంబై క్రికెట్ దిగ్గ‌జం అజింక్య ర‌హానే(Ajinkya Rahane) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.  రాబోయే దేశవాళీ సీజన్‌కు ముంబై జ‌ట్టు కెప్టెన్సీ నుంచి ర‌హానే త‌ప్పుకొన్నాడు. ఈ సీనియ‌ర్‌ ప్లేయ‌ర్ నాయ‌క‌త్వంలోనే 2023-24 రంజీ ట్రోఫీని ముంబై సొంతం చేసుకుంది.

అంతేకాకుండా 2024లో ఇరానీ కప్‌ను కూడా ముంబైకి అజింక్య అందించాడు. అయితే ముంబై జ‌ట్టుకు కొత్త నాయ‌కుడిని తాయారు చేసే స‌మ‌యం అస‌న్న‌మైంద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ర‌హానే వెల్ల‌డించాడు.

"ముంబై జ‌ట్టు త‌ర‌పున ఛాంపియ‌న్‌షిప్‌లు గెల‌వ‌డం, కెప్టెన్‌గా ప‌నిచేయ‌డం నాకు దక్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌రి కొన్ని రోజుల్లో కొత్త డొమాస్టిక్ సీజ‌న్ (2025-2026) ప్రారంభం కానుంది. కాబ‌ట్టి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. 

అందుకే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కానీ ఆట‌గాడిగా మాత్రం కొన‌సాగ‌నున్నాను. ఆటగాడిగా  అత్యుత్తమ ప్రదర్శన చేసి ముంబైకి మ‌రిన్ని ట్రోఫీలను అందించేందుకు ప్ర‌య‌త్నిస్తాను" అని ఎక్స్‌లో ర‌హానే రాసుకొచ్చాడు.

కాగా ర‌హానే ముంబై కెప్టెన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  2022-23లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2022-23లో దులీప్ ట్రోఫీ, 2023-24లో రంజీ ట్రోఫీ వంటి టైటిల్స్‌ను కెప్టెన్‌గా ర‌హానే గెలుచుకున్నాడు. అంతేకాకుండా రహానే గతంలో టీ20లు, వన్డేలు, టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ర‌హానే ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్ సార‌థిగా ఉన్నాడు.

ఈ ఏడాది ర‌హానే త‌న 9వ ఫస్ట్-క్లాస్ సీజన్ ఆడ‌నున్నాడు. అయితే ర‌హానేకు దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జ‌ట్టులో చోటు ద‌క్కలేదు. అత‌డికి బ‌దులుగా ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ముంబై జట్టుకు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

ఇక రహానే వారుసుడిగా ముంబై జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టేందుకు చాలా మంది ఉన్నారు. వారిలో శార్ధూల్ ఠాకూర్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ముందంజ‌లో ఉంటారు.
చదవండి: హ్యాట్సాఫ్‌ ధనశ్రీ: రోహిత్‌ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా

Videos

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

Photos

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)