Breaking News

ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడనున్న రహానే.. విండీస్‌ నుంచి నేరుగా

Published on Sun, 06/18/2023 - 14:30

టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానే  మరోసారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడనున్నాడు. . కౌంటీ ఛాంపియన్‌ షిప్‌ డివిజన్ టూలో లీసెస్టర్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌కు రహానే ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ అనంతరం ఇంగ్లండ్‌కు రహానే పయనం కానున్నట్లు తెలుస్తోంది.

కాగా దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎం‍ట్రీ ఇచ్చిన రహానే.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక ఈ ఏడాది జనవరిలోనే లీసెస్టర్‌షైర్‌ క్రికెట్‌ క్లబ్‌తో రహానే ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఒప్పందంలో భాగంగా  8 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ మొత్తం రహానే ఆడనున్నాడు. కాగా అంతకుముందు 2019 కౌంటీ సీజన్‌లో హాంప్‌షైర్ తరపున రహానే ఆడాడు. ఇ​క ఇప్పటికే భారత్‌ నుంచి ఛతేశ్వర్‌ పుజారా, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: Virat Kohli: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్‌!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)