Breaking News

సూర్యవంశీపై గిల్ కామెంట్స్‌.. జడేజా కౌంట‌ర్‌

Published on Tue, 04/29/2025 - 14:42

ఐపీఎల్‌లో రికార్డు సెంచరీతో చెల‌రేగిన‌ 'సిక్స‌ర పిడుగు' వైభవ్‌ సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జడేజా అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. అత‌డు అలా మాట్లాడి ఉండాల్సి కాద‌ని పరోక్షంగా కౌంట‌ర్ ఇచ్చాడు. జైపూర్‌లోని స‌వాయ్‌ మాన్‌సింగ్ స్టేడియంలో సోమ‌వారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీనేజీ సంచ‌ల‌నం సూర్యవంశీ (14) సూప‌ర్ సెంచ‌రీతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఘ‌న విజ‌యం అందించాడు. దీంతో క్రికెట్ ప్ర‌పంచంలో అత‌డి పేరు మార్మోగిపోతోంది. ఈ రోజు ఆ 14 ఏళ్ల ఈ కుర్రాడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. సూర్యవంశీకి అదృష్టం క‌లిసి వ‌చ్చింద‌న్న‌ట్టుగా వ్యాఖ్యానించాడు. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్నాడ‌ని కామెంట్ చేశాడు. "ఇది అతడి (అదృష్ట) రోజు. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అతడు తన రోజును పూర్తిగా ఉపయోగించుకున్నాడ"ని గిల్ అన్నాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై అజ‌య్ జ‌డేజా త‌న‌దైన శైలిలో స్పందించాడు. "14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎంత‌గా అంటే తాను న‌మ్మిన‌దాన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చాల‌నుకున్నాడు. చేసి చూపించాడు. ఎవరో ఆటగాడు చెప్పినట్లుగా ఇది అతడి అదృష్ట దినం" అని కౌంట‌ర్ ఇచ్చాడు.

చిన్న వ‌య‌సులోనే రికార్డు సెంచ‌రీతో చెల‌రేగిన సూర్యవంశీపై అజ‌య్ జ‌డేజా (Ajay Jadeja) ప్ర‌శంసలు కురిపించాడు. "క్రికెట్ ఆడే మనమందరం.. డ్రాయింగ్ రూమ్‌లలో లేదా  స్నేహితులతో ఆడుతున్నప్పుడో ఒక నిర్దిష్ట మార్గంలో మ‌న ఆట‌ గురించి కలలు కన్నాం. మ‌నం ఇష్ట‌ప‌డేది సాధించాల‌ని 14 మరియు 15 సంవత్సరాల వయస్సులో మ‌నమంతా స్వ‌ప్నించాం. కానీ సూర్యవంశీ తన క‌ల‌ను నిజం చేసుకోవాల‌ని జీవించాడు. అదే అత‌డి శ‌క్తి. ఇక అత‌డి ఆట‌ను వంద సార్లు విశ్లేషిస్తార"ని జ‌డేజా పేర్కొన్నాడు.

వైభవ్‌ సూర్యవంశీ స‌క్సెస్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ హెచ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ (Vikram Rathour) కీలంగా వ్యహ‌రించార‌ని జ‌డేజా వెల్ల‌డించాడు. సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్స‌హించార‌ని ప్ర‌శంసించాడు. కాగా, రాజ‌స్తాన్ త‌న త‌ర్వాతి మ్యాచ్ మే 1న జైపూర్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో ఆడుతుంది. మే 12న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆర్‌ఆర్  త‌ల‌ప‌డ‌నుంది. 

చ‌ద‌వండి: తండ్రి త్యాగం, ప‌ట్టుద‌ల‌తో ఎదిగిన వైభవ్‌ సూర్యవంశీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)