Breaking News

అజయ్‌ బాబుకు స్వర్ణ పతకం

Published on Fri, 08/29/2025 - 01:32

అహ్మదాబాద్‌: కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు వల్లూరి అజయ్‌ బాబు, బేద్‌బ్రత్‌ భరాలి బంగారు పతకాలు సాధించారు. గురువారం జరిగిన సీనియర్‌ పురుషుల 79 కేజీల కేటగిరీలో జాతీయ క్రీడల చాంపియన్‌ అయిన అజయ్‌ బాబు మొత్తం 335 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 152 కేజీల బరువెత్తి కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ రికార్డును కూడా నెలకొల్పాడు. 

క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 183 కేజీలు ఎత్తాడు. స్నాచ్‌లో ఇంతకుముందు నైజీరియాకు చెందిన ఎడిడివోంగ్‌ జోసెఫ్‌ 147 కేజీల రికార్డును అజయ్‌ తిరగరాశాడు. గత క్రీడల్లోనూ అతను బంగారు పతకం సాధించినప్పటికీ అప్పుడు 81 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. సీనియర్‌ మహిళల 69 కేజీల కేటగిరీలో కామన్వెల్త్‌ క్రీడల (2022) కాంస్య పతక విజేత హర్జిందర్‌ కౌర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. 

జూనియర్‌ పురుషుల 79 కేజీల విభాగంలో బేదబ్రత్‌ భరాలి స్నాచ్, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో కొత్త రికార్డులతో పసిడి పట్టాడు. అతను స్నాచ్‌లో 145 కేజీల బరువెత్తాడు. తద్వారా 139 కేజీల గత రికార్డును అధిగమించాడు. అలాగే క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తి 169 కేజీల గత రికార్డును తుడిచిపెట్టాడు. మొత్తంగా బేదబ్రత్‌ 326 కేజీల బరువెత్తాడు. యూత్‌ మహిళల 77 కేజీల విభాగంలో గ్రీష్మ తోరట్‌ రజతం నెగ్గింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)