Breaking News

భారత షూటర్ల జోరు

Published on Mon, 08/25/2025 - 00:39

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం సీనియర్‌ పురుషుల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ స్వర్ణ పతకం నెగ్గగా... టీమ్‌ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్,  చెయిన్‌ సింగ్, అఖిల్‌ షెరాన్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్‌ 462.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

వెన్‌యు జావో (చైనా; 462) రజతం, నయోవా ఒకాడా (జపాన్‌; 448.8) కాంస్యం గెలిచారు. చెయిన్‌ సింగ్‌ (435.7) నాలుగో స్థానంలో, అఖిల్‌ (424.9 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగంలో ఐశ్వర్య ప్రతాప్‌ (584 పాయింట్లు), చెయిన్‌ సింగ్‌ (582 పాయింట్లు), అఖిల్‌ (581 పాయింట్లు) బృందం మొత్తం 1747 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత భారత్‌కు చెందిన అడ్రియన్‌ కర్మాకర్‌ (463.8 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. టీమ్‌ విభాగంలో అడ్రియన్, నితిన్, రోహిత్‌లతో కూడిన భారత బృందం 1733 పాయింట్లతో పసిడి పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా భారత్‌ 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 46 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)