Breaking News

పాక్‌ ఎఫెక్ట్‌..? ఐసీసీ సీఈవో అలార్డీస్‌ రాజీనామా

Published on Wed, 01/29/2025 - 08:54

దుబాయ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ సీఈవో సీఈవో జెఫ్‌ అలార్డీస్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. 

ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్‌ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్‌ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో కాకుండా.. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది. 

క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్‌ 2012లో జనరల్‌ మేనేజర్‌గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్‌ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్‌ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్‌లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్‌ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్‌ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్‌ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.

మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ క్రిస్‌ టెట్లే, యాంటీ కరప్షన్‌ యూనిట్‌ హెడ్‌ అలెక్స్‌ మార్షల్‌, మార్కెటింగ్‌ & మీడియా హెడ్‌ క్లెయిర్‌ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)