Breaking News

నిన్న రహానే.. ఇప్పుడు పుజారా! కన్ఫ్యూజన్‌లో అభిమానులు

Published on Sat, 12/30/2023 - 17:53

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత ఇద్దరు సీనియర్‌ క్రికెటర్ల పేర్లు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వారెవరో కాదు.. అజింక్య రహానే, ఛతేశ్వర్‌ పుజారా. టెస్టు స్పెషలిస్టులైన ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉత్తమంగా రాణించిన రికార్డు వీరికి ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 85 టెస్టులు ఆడిన ముంబై బ్యాటర్‌ రహానే 5077 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలోనే ఆసీస్‌ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ గెలిచిన మ్యాచ్‌ జరిగింది.

ఇక ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌ సిరీస్‌ సందర్భంగా రహానే చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. మరోవైపు.. తన కెరీర్‌లో ఇప్పటిదాకా భారత్‌ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్‌ చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా జూన్‌లో అతడు ఆఖరిసారి టీమిండియాకు ఆడాడు.

అయితే, దేశవాళి క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్‌ కౌంటీల్లోనూ ఆడుతూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరిని గనుక సౌతాఫ్రికాతో టెస్టులకు ఎంపిక చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర బ్యాటర్‌ పుజారా ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడేందుకు తాను సన్నద్ధం అవుతున్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో అతడు రెడ్‌ బాల్‌తో కాకుండా వైట్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు.. రహానే సైతం శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. ‘‘విశ్రాంతి లేని రోజులు’’ అంటూ రంజీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. కాగా టెస్టుల్లో అపార అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్నా టీమిండియా సెలక్టర్లు తమను పక్కన పెట్టడాన్ని రహానే- పుజారా చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ భారత జట్టులో చోటే లక్ష్యంగా వీరిద్దరు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.

చదవండి:Rohit Sharma: ఘనంగా రోహిత్‌ గారాలపట్టి సమైరా బర్త్‌డే.. వీడియో వైరల్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?