Breaking News

మనదే జోరు...

Published on Mon, 06/08/2026 - 02:40

న్యూ చండీగఢ్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్‌ జట్టు... సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టుపై పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన టీమిండియా... ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో ప్రత్యర్థిని స్పిన్‌ ఉచ్చులో బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 368/3తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (177 బంతుల్లో 126; 15 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోగా... రిషబ్‌ పంత్‌ (121 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాషింగ్టన్‌ సుందర్‌ (68 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో సత్తా చాటారు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో సలీమ్‌ 140 పరుగులిచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అఫ్గాన్‌... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. 

రహమత్‌ షా (81 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20) సహా టాపార్డర్‌ మొత్తం విఫలమైంది.  భారత బౌలర్లలో అరంగేట్ర లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ 15.5 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్‌ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. చేతిలో ఐదు వికెట్లు ఉన్న అఫ్గానిస్తాన్‌... టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 451 పరుగుల దూరంలో ఉంది. ఫాలోఆన్‌ ఇన్నింగ్స్‌ తప్పించుకోవాలంటే అఫ్గానిస్తాన్‌ మరో 252 పరుగులు సాధించాలి.  

మెరిసిన మానవ్‌ 
ఈ మ్యాచ్‌ ద్వారానే అరంగేట్రం చేసిన మానవ్‌ సుతార్‌... తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తున్న మాట వాస్తవమే అయినా... మానవ్‌ తన వైవిధ్యంతో కట్టిపడేశాడు. పదేపదే ఒకే చోట బంతిని వేస్తూ ఫలితం రాబట్టాడు. వరుసగా ఒకే ఎండ్‌ నుంచి 13 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన 23 ఏళ్ల మానవ్‌... తాను టెస్టు క్రికెట్‌కు పూర్తిగా సిద్ధమయ్యే వచ్చినట్లు నిరూపించుకున్నాడు. 

రవీంద్ర జడేజా తరహాలోనే లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేయగలగడంతో పాటు... అవసరమైతే కింద వరుసలో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా ఆడటంలో మానవ్‌ దిట్ట. ఈ మ్యాచ్‌లో అతడు బ్యాట్‌తోనూ మెరిశాడు. ఏడో స్థానంలో క్రీజులో అడుగుపెట్టి 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 24; రాహుల్‌ (సి) రహ్మనుల్లా (బి) జియాఉర్‌ రహమాన్‌ 100; సాయి సుదర్శన్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 81; గిల్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 126; పంత్‌ (సి) అజ్మతుల్లా (బి) హష్మతుల్లా 81; జురేల్‌ (బి) సలీమ్‌ 19; సుందర్‌ (నాటౌట్‌) 52; మానవ్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 28; సిరాజ్‌ (బి) సలీమ్‌ (22); కుల్దీప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 22;మొత్తం (127 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్‌) 564. వికెట్ల పతనం: 1–41, 2–180, 3–247, 4–416, 5–452, 6–456, 7–510, 8–540. బౌలింగ్‌: జియాఉర్‌ రహమాన్‌ 24–2–91–1; అజ్మతుల్లా 22–5–67–0; సలీమ్‌ 27–3–140–6; ఖరోటె 23–0–115–0; అబ్దుల్‌ 7–0–43–0; హష్మతుల్లా 24–1–91–1. 

అఫ్గానిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: అబ్దుల్‌ (సి) సిరాజ్‌ (బి) మానవ్‌ 16; సాదిఖుల్లా (బి) ప్రసిధ్‌ 17; రహ్మానుల్లా (సి) సుదర్శన్‌ (బి) మానవ్‌ 12; రహమత్‌ షా (బ్యాటింగ్‌) 43; హష్మతుల్లా (ఎల్బీ) ప్రసిధ్‌ 20; అఫ్సర్‌ (సి అండ్‌ బి) మానవ్‌ 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–28, 2–40, 3–62, 4–98, 5–113. బౌలింగ్‌: సిరాజ్‌ 6– 1–24–0; ప్రసిధ్‌ 7–0–27–2; మానవ్‌ 15.5–7–21–3; కుల్దీప్‌ 7–0–29–0; సుందర్‌ 4–0–12–0.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)