Breaking News

ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన

Published on Fri, 01/09/2026 - 14:58

2026 అండర్‌-19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇవాళ (జనవరి 9) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మహబూబ్ ఖాన్ నియమితుడయ్యాడు. స్టార్‌ బ్యాటర్లు ఉజైరుల్లా నియాజై, ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, అజీజ్ మియా ఖిల్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. నియాజై ఇటీవలి బంగ్లాదేశ్‌ పర్యటనలో, ఆసియా కప్‌ 2025లో సత్తా చాటాడు.

బౌలింగ్ విభాగంలో నూరిస్తానీ ఓర్మాజీ (ప్రధాన పేస్ బౌలర్‌), స్పిన్ విభాగంలో జియాతుల్లా షాహీన్, హఫీజ్‌ఉల్లా జద్రాన్, వహీద్‌ఉల్లా జద్రాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అండర్‌-19 విభాగంలోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు స్పిన్ బౌలింగే ప్రధాన ఆయుధం. 

ఈ జట్టులో ఖతీర్ స్టానిక్‌జై, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్ పరిశీలించదగ్గ ఆటగాళ్లు. రిజర్వ్‌ ప్లేయర్లుగా అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్ ఎంపికయ్యారు.

ఈ మెగా టోర్నీ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ఇండియా, యూఎస్‌ఏ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 

ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రయాణం​ జనవరి 16న సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం 18న వెస్టిండీస్‌తో, 21న టాంజానియాతో తలపడనుంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఆసియా క్వాలిఫయర్‌లో నేపాల్‌పై నెట్ రన్ రేట్ ఆధారంగా ముందంజ వేసి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.  

అండర్‌19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తి జట్టు..  
మహబూబ్ ఖాన్ (c), ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, ఫైసల్ ఖాన్, ఉజైరుల్లా నియాజై, అజీజ్ మియా ఖిల్, నజీఫ్ అమిరి, ఖతీర్ స్టానిక్‌జై, నూరిస్తానీ, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, వహీద్ జద్రాన్, జియాతుల్లా షాహీన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్

రిజర్వ్స్: అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)