అఫ్గానిస్తాన్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వేటు

Published on Sat, 07/25/2026 - 15:04

ఐర్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌తో రహ‌మ‌త్ షా అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా త‌న ప్ర‌య‌ణాన్ని ప్రారంభించ‌నున్నాడు. హ‌స్మ‌తుల్లా షాహిది కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను ర‌హ‌మ‌త్‌కు ఏసీబీ అప్ప‌గించింది. 

ఇక‌ గత నెలలో భారత్‌లో జరిగిన వ‌న్డే సిరీస్‌కు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హాక్ ఫరూఖీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీపై మాత్రం అఫ్గాన్ సెల‌క్ష‌న్ క‌మిటీ వేటు వేసింది. అత‌డి స్దానంలో యామిన్ అహ్మద్‌జాయ్‌కి పిలుపునిచ్చారు. 

అహ్మ‌ద్‌జాయ్ చివ‌ర‌గా అక్టోబర్ 2025లో అఫ్గాన్ త‌ర‌పున ఆడాడు. ఈ జ‌ట్టులో అజ్మ‌తుల్లా ఓమర్జాయ్‌, ర‌షీద్ ఖాన్ వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెలలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 14 మధ్య జరగనుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 స‌న్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. 

అఫ్గానిస్తాన్ గ‌త నెల‌లో  భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతకుముందు అబుదాబిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం 3-0 తేడాతో అఫ్గాన్‌ విజయం సాధించింది.
చదవండి: IND vs ZIM: ‘అతడొక సంచలనం.. బౌలింగ్‌ కూడా చేయిస్తాం’

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)