2026 టీ20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ప్రకటన

Published on Wed, 12/31/2025 - 15:08

వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 31) ప్రకటించారు. ఈ జట్టును స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ముందుండి నడిపించనున్నాడు. స్టార్‌ ఆటగాళ్లు గుల్బదిన్‌ నైబ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ ఇషాక్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు.

తాజాగా జింబాబ్వే సిరీస్‌లో ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్‌జాయ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఛాంపియన్‌ జట్లకు సైతం వణుకు పుట్టిస్తుంది. 

ఈ జట్టులో రషీద్‌ ఖాన్‌ సహా చాలామంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. నూర్‌ అహ్మద్‌, సెదిఖుల్లా అటల్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్‌, మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఇబ్రహీం జద్రాన్‌ లాంటి ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. 

పైగా వీరికి భారత్‌, శ్రీలంకలో పరిస్థితులపై సరైన అవగాహన కూడా ఉంది. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును చూసి భారత్‌ సహా మిగతా జట్లన్నీ అప్రమత్తం అవుతున్నాయి.

2026 టీ20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు..
రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్‌ హక్ ఫారూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్

రిజర్వ్ ఆటగాళ్లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.  

ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గ్రూప్‌-డిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న న్యూజిలాండ్‌తో చెన్నైలో ఆడనుంది. 

ప్రపంచకప్‌కు ముందు (జనవరి 19 నుంచి) ఇదే ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా ఆడనుంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)