ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం

Published on Fri, 12/29/2023 - 21:07

యూఏఈతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయ్యాక గుర్బాజ్‌ మరో రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. గుర్బాజ్‌కు టీ20ల్లో ఇది తొలి శతకం. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున 44 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్‌.. సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 1143 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. గుర్బాజ్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌, కేకేఆర్‌ల తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 133.53 స్ట్రయిక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌తో పాటు కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. జద్రాన్‌ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 173/2గా ఉంది. జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్‌ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖీ, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌లకు తలో వికెట్‌ దక్కింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌.. యూఏఈలో పర్యటిస్తుండగా, షార్జాలో ఇవాళ (డిసెంబర్‌ 29) తొలి టీ20 జరుగుతుంది. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)