Breaking News

AFG vs IND Final: భారత్‌- ఆఫ్గాన్‌ ఫైనల్‌ రద్దు.. టీమిండియాకు గోల్డ్‌

Published on Sat, 10/07/2023 - 11:36

ఆసియాక్రీడల్లో భారత్‌-ఆఫ్గానిస్తాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్లలో 112/5 వద్ద మ్యాచ్‌ ఆగిపోయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ సేనకు స్వర్ణం ఖాయమైంది.

18 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 109/5
18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్‌(48), నైబ్‌(26) పరుగులతో ఉన్నారు.

15 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 86/5
15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్‌ స్కోర్‌: 70/5
13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్‌(36), నైబ్‌(4) పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్‌..
భారత్‌తో జరగుతున్న ఫైనల్‌లో ఆఫ్గానిస్తాన్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 53 పరుగుల  వద్ద ఆఫ్గానిస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఇఒక్క పరుగు మాత్రమే చేసిన కరీం జనత్‌.. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 53/5

నాలుగో వికెట్‌ డౌన్‌.. 
49 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జజాయ్‌.. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

9 ఓవర్లలో అఫ్గనిస్తాన్‌ స్కోరు: 47/3
షహీదుల్లా కమల్‌ నిలకడగా ఆడుతుండటంతో(21 పరుగులతో ) అఫ్గన్‌ ఇన్నింగ్స్‌ తిరిగి గాడిలో పడింది.

13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్గానిస్తాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. నూర్ అలీ జద్రాన్ రూపంలో ఆఫ్గానిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్‌ రనటౌయ్యాడు.

రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగులు చేసిన జుబైద్‌ అక్బరీను శివమ్‌ దుబే పెవిలయన్‌కు పంపగా.. మహ్మద్‌ షాజాద్‌(4)ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేశాడు. 3 ఓవర్లకు ఆఫ్గాన్‌ స్కోర్‌: 10/2

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా
ఈ గోల్డ్‌మెడల్‌ పోరులో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా పేసర్‌ అవేష్‌ ఖాన్‌ దూరమయ్యాడు. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌ ఒకే ఒక మార్పు చేసింది. జుబైద్ అక్బరీ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
భారత్‌:  రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్దీప్ సింగ్

ఆఫ్గానిస్తాన్‌:  జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్‌ కీపర్‌), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్‌), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్

టాస్‌ ఆలస్యం..
ఏషియన్‌ గేమ్స్‌-2023 పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్‌- ఆఫ్గానిస్తాన్‌ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ కాస్త ఆలస్యం కానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)