Breaking News

పసికూనపై విరుచుకుపడిన టీమిండియా... భారీ విజయం

Published on Mon, 12/02/2024 - 18:05

అండర్‌-19 ఆసియా కప్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్‌తో ఇవాళ (డిసెంబర్‌ 2) జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత్‌ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ మొహమ్మద్‌ అమాన్‌ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించగా.. స్టార్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్‌ 35, నిఖిల్‌ కుమార్‌ 12, హర్వంశ్‌ సింగ్‌ 1, హార్దిక్‌ రాజ్‌ 25 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

జపాన్‌ బౌలర్లలో కీఫర్‌ యమమోటో లేక్‌, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్‌ హింజే, ఆరవ్‌ తివారి చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్‌.. భారత బౌలర్లు యుధాజిత్‌ గుహ (7-3-9-1), హార్దిక్‌ రాజ్‌ (8-2-9-2), చేతన్‌ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

జపాన్‌ ఇన్నింగ్స్‌లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్‌ హింజే (35 నాటౌట్‌), నిహార్‌ పర్మార్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)