Breaking News

Asia Cup 2024 Final: ఆఫ్ఘనిస్తాన్‌ టార్గెట్‌ 134 రన్స్‌

Published on Sun, 10/27/2024 - 21:20

ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీ ఫైనల్లో ఇవాళ (అక్టోబర్‌ 27) శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్‌-ఏ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లు బిలాల్‌ సమీ (4-0-22-3), అల్లా ఘజన్‌ఫర్‌ (4-0-14-2) సత్తా చాటడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో సహన్‌ అరచ్చిగే (64 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. పవన్‌ రత్నాయకే (20), నిమేశ్‌ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్‌ విక్రమసింఘే (4), రమేశ్‌ మెండిస్‌ (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. దుషన్‌ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్‌ రత్నాయకే, నిమేశ్‌ విముక్తి రనౌటయ్యారు.  

అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జుబైద్‌ అక్బరీ (0), కెప్టెన్‌ దర్విష్‌ రసూలీ (24) ఔట్‌ కాగా.. సెదికుల్లా అటల్‌ (19), కరీం జనత్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలవాంటే మరో 72 బంతుల్లో 87 పరుగులు చేయాలి.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)