Breaking News

‘పసికూన’పై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్‌

Published on Fri, 11/14/2025 - 16:10

ఆసియా క్రికెట్‌ మండలి నిర్వహిస్తున్న ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌- 2025 ( Asia Cup Rising Stars) టోర్నమెంట్‌ శుక్రవారం మొదలైంది. దోహా వేదికగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌- ‘ఎ’- ఒమన్‌ జట్లు తలపడ్డాయి. వెస్ట్‌ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఒమన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

పరుగుల విధ్వంసం
ఈ క్రమంలో ఆదిలోనే ఓపెనర్‌ మొహమ్మద్‌ నయీమ్‌ (6) వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌.. తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మరో ఓపెనర్‌ మాజ్‌ సదాకత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి 96 పరుగులు చేసిన సదాకత్‌ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

మిగతా వాళ్లలో యాసిర్‌ ఖాన్‌ (26 బంతుల్లో 26), మొహ్మద్‌ ఫైక్‌ (9 బంతుల్లో 19) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ 21 బంతుల్లోనే 44 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో సాద్‌ మసూద్‌ మెరుపులు (6 బంతుల్లో 19 నాటౌట్‌) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్‌-ఎ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు సాధించింది.

ఆది నుంచే కష్టాలు
ఒమన్‌ బౌలర్లలో షఫీక్‌ జాన్‌, ముజాహిర్‌ రజా, జే ఒడేడ్రా, వసీం అలీ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్‌ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్‌ సూఫియాన్‌ యూసఫ్‌ (3) విఫలం కాగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ హమ్మద్‌ మీర్జా (27 బంతుల్లో 34) రనౌట్‌ అయి వికెట్‌ పారేసుకున్నాడు.

వన్‌డౌన్లో వచ్చిన కరణ్‌ సోనావాలే (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్‌లో వసీం అలీ (5), నారాయణ్‌ సాయిశివ్‌ (1), ఆర్యన్‌ బిస్త్‌ (2) పూర్తిగా నిరాశపరిచారు. జై ఒడేడ్రా డకౌట్‌ అయ్యాడు.ఘా

ఆఖర్లో మెరుపులు..
ఇలాంటి దశలో జిక్రియా ఇస్లాం, ముజాహిర్‌ రజా ధనాధన్‌ దంచికొట్టి జట్టు విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిక్రియా ఇస్లాం మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు- 57 పరుగులు) సాధించగా.. రజా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించలేదు.

బోణీ కొట్టిన పాక్‌
ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. ఒమన్‌ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పాకిస్తాన్‌ ఒమన్‌పై 40 పరుగుల తేడాతో గెలిచింది. విజయంతో ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింట్‌ స్టార్స్‌ టీ20 టోర్నీని ఆరంభించింది. మాజ్‌ సదాకత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: గంభీర్‌ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్‌ చరిత్రలోనే

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)