Breaking News

Asia Cup 2023: రేపే భారత్‌-పాక్‌ సమరం

Published on Tue, 07/18/2023 - 15:36

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 టోర్నీలో రేపు (జులై 19) భారత్‌-ఏ, పాకిస్తాన్‌-ఏ జట్లు కత్తులు దూసుకోనున్నాయి. గ్రూప్‌-బిలోని ఆఖరి మ్యాచ్‌లో ఈ ఇరు జట్లు ఎదురెదురుపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్‌, పాక్‌లు గ్రూప్‌ దశలో చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పరంగా సమంగా ఉన్నాయి. అయితే పాక్‌ (2.875)తో పోలిస్తే భారత్‌ (3.792)కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో ప్రస్తుతానికి యంగ్‌ ఇండియా గ్రూప్‌ టాపర్‌గా ఉంది. గ్రూప్‌ దశలో భారత్‌, పాక్‌లు.. యూఏఈ, నేపాల్‌ జట్లపై విజయాలు సాధించాయి. 

మరోవైపు గ్రూప్‌-ఏలో రసవత్తర పోరు సాగుతుంది. ఆప్ఘనిస్తాన్‌ ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా ఉండగా.. బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు 2 మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌  గెలిచి గ్రూప్‌లో రెండో బెర్తు కోసం పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఒమన్‌ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పోటీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బిలో టాపర్లుగా ఉన్న రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. గ్రూప్‌-ఏలో భాగంగా ఇవాళ (జులై 18) బంగ్లాదేశ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు.. శ్రీలంక- ఒమన్‌ జట్లు తలపడనున్నాయి. రేపు భారత్‌-పాక్‌ మ్యాచ్‌తో పాటు నేపాల్‌-యూఏఈ మ్యాచ్‌ కూడా జరుగనుంది.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. యూఏఈపై 8 వికెట్ల తేడాతో, నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యూఏఈపై బౌలర్లలో హర్షిత్‌ రాణా (4), నితీష్‌ రెడ్డి (2), మానవ్‌ సుతార్‌ (2), అకాశ్‌ సింగ్‌ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ అజేయ శతకంతో (108) మెరిశాడు. నికిన్‌ జోస్‌ (41 నాటౌట్‌) పర్వాలేదనిపించాడు. 

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో నిషాంత్‌ సింధు (4), హంగార్గేకర్‌ (3), హర్షిత్‌ రాణా (2), మానవ్‌ సుతార్‌ (1) రాణించగా.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్‌ (58 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (87) దృవ్‌ జురెల్‌ (21 నాటౌట్‌) మెరిశారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)