Breaking News

ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఆఫ్ఘన్‌ ఆటగాడి విధ్వంసం

Published on Wed, 11/27/2024 - 07:07

అబుదాబీ టీ10 లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్న జజాయ్‌ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. నార్త్రన్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. వారియర్స్‌ బౌలర్‌ అంకుర్‌ సాంగ్వాన్‌ జజాయ్‌ ధాటికి బలయ్యాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఐదో బంతి మినహా మిగిలిన ఐదు బంతులను జజాయ్‌ సిక్సర్లుగా మలిచాడు. 

ఈ మ్యాచ్‌లో జజాయ్‌ 23 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 53 పరుగులు చేశాడు. జజాయ్‌తో పాటు మొహమ్మద్‌ షెహజాద్‌  (25 బంతుల్లో 54 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నార్త్రన్‌ వారియర్స్‌పై బంగ్లా టైగర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్రన్‌ వారియర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో 28 బంతుల్లో 4 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో మున్రో మినహా ఎవరూ రాణించలేదు. 

బ్రాండన్‌ కింగ్‌ (12), జాన్సన్‌ చార్లెస్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ 7, అజ్మతుల్లా 4, జియా ఉర్‌ రెహ్మాన్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా టైగర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, ఇఫ్తికార్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్‌ పేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్‌ 7.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది వరుసగా రెండో విజయం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)