Breaking News

'అత‌డు లేక‌పోవ‌డం కలిసొచ్చింది.. వారి వ‌ల్లే చెల‌రేగుతున్నాను'

Published on Sun, 11/09/2025 - 08:00

బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టీ20 వర్షార్ఫణమైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ పంజాబీ క్రికెటర్ మొత్తంగా 161.39 స్ట్రైక్ రేటుతో 163 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మార్క్ అందుకున్న క్రికెట‌ర్‌గా అభిషేక్(528) నిలిచాడు.

"ఆ్రస్టేలియా పర్యటన కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. ఇక్కడ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అక్కడి పరిస్ధితులకు తగ్గట్టుగా నేను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. మేము మరింత భారీ స్కోర్లు సాధించాల్సింది. అయితే జట్టు సిరీస్‌ గెలవడం ముఖ్యం. జోష్ హేజిల్‌వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోవడం ఏ జట్టుకైనా ప్రయోజనకరమే. 

కానీ భవిష్యత్తులో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా అటువంటి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇక టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. నేను వరుసగా 15 మ్యాచ్‌లలో డకౌట్‌ అయినా నా స్థానానికి ఢోకా ఉండదని చెప్పింది. అందుకే తొలి బంతినుంచే ధైర్యంగా, దూకుడుగా ఆడగలుగుతున్నా. తొలిసారి టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో అభిషేక్ పేర్కొన్నాడు. 
చదవండి: ‘బంగభూషణ్‌’ రిచా ఘోష్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)