Breaking News

అభిషేక్‌ శర్మకు నో ప్లేస్‌.. ఊహించని ఆటగాడికి కెప్టెన్సీ

Published on Mon, 08/03/2026 - 17:30

దులీప్‌ ట్రోఫీ 2026 కోసం 15 మంది సభ్యుల నార్త్‌ జోన్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎవరూ ఊహించిన ఆటగాడికి అవకాశం లభించింది. 

జమ్మూ కశ్మీర్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కన్హయ్య వాధ్వాన్‌కు సెలెక్టర్లు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. అతడికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) ఢిల్లీకి చెందిన ఆయుష్‌ బదోనీని ఎంపిక​ చేశారు.

ఈ జట్టులో అత్యధికంగా (6) రంజీ ఛాంపియన్‌ జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్లకు చోటు లభించింది. టీమిండియా ఆటగాళ్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, అన్షుల్‌ కాంబోజ్‌ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ ఆడాల్సి ఉన్నందున శుభ్‌మన్‌ గిల్‌, ఆకిబ్‌ నబీని ఎంపిక​ చేయలేదు. దులీప్‌ ట్రోఫీ ఆగస్టు 23న ప్రారంభం కానుండగా.. అదే రోజు నార్త్‌ జోన్‌-వెస్ట్‌ జోన్‌ మ్యాచ్‌ ప్రారంభం​ కానుంది.

నార్త్‌ జోన్‌ జట్టు:
సనత్‌ సంగ్వాన్‌, క్వామ్రాన్‌ ఇక్బాల్‌, యశ్‌ ధుల్‌, ఆయుష్‌ దోసేజా, అబ్దుల్‌ సమద్‌, ఆయుష్‌ బదోనీ (వైస్‌ కెప్టెన్‌), కన్హయ్య వాధ్వాన్‌ (కెప్టెన్‌), నిశాంత్‌ సింధు, అర్జున్‌ శర్మ, అబిద్‌ ముస్తాక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సునీల్‌ కుమార్‌, అన్షుల్‌ కాంబోజ్‌, యుధ్వీర్‌ సింగ్‌, నిఖిల్‌ కశ్యప్‌.

ఎవరీ కన్హయ్య వాధ్వాన్..?
జమ్మూ కశ్మీర్‌ రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ సాధించడంలో వాధ్వాన్‌ కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 474 పరుగులు, 36.56 సగటుతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

24 ఏళ్ల వాధ్వాన్‌ గతేడాది దులీప్‌ ట్రోఫీలో నార్త్‌ జోన్‌ తరఫున ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 99 పరుగులు చేశాడు. గత ఎడిషన్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో ఆడిన అతను, ఇప్పుడు తొలిసారి నార్త్‌ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)