Breaking News

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు

Published on Wed, 10/01/2025 - 14:51

టీమిండియా నయా విధ్వంసకర వీరుడు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ చరిత్రలో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు (ICC T20I Rating Points) సాధించిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్‌ 2025లో అదిరిపోయే ప్రదర్శనల తర్వాత అభిషేక్‌ నంబర్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రేటింగ్‌ పాయింట్లను గణనీయంగా పెంచుకున్నాడు.

ఇవాళ (అక్టోబర్‌ 1) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ రేటింగ్‌ పాయింట్లు 931కు చేరుకున్నాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ ఇన్ని రేటింగ్‌ పాయింట్లు లేవు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ పేరిట ఉండేది. మలాన్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 919 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు.

భారత్‌ తరఫున అభిషేక్‌కు ముందు అత్యధిక రేటింగ్‌ పాయింట్లను సూర్యకుమార్‌ యాదవ్‌ సాధించాడు. స్కై తన కెరీర్‌లో అత్యుత్తమంగా 912 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. స్కై తర్వాతి స్థానంలో విరాట్‌ కోహ్లి ఉన్నాడు. విరాట్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 909 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు.

అత్యధిక ఐసీసీ రేటింగ్‌ పాయింట్లు సాధించిన టీ20 బ్యాటర్లు (టాప్‌-5)
అభిషేక్‌ శర్మ- 931
డేవిడ్‌ మలాన్‌- 919
సూర్యకుమార్‌ యాదవ్‌- 912
విరాట్‌ కోహ్లి- 909
ఆరోన్‌ ఫించ్‌- 904

కాగా, తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో అభిషేక్‌ శర్మ అత్యుత్తమ ప్రదర్శనలతో చెలరేగాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడి 200 స్ట్రయిక్‌రేట్‌తో 44.86 సగటున 314  పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)