కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌..

Published on Thu, 10/30/2025 - 20:25

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను కేకేఆర్ నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ధ్రువీకరించారు.

గత సీజన్‌లో హెడ్‌కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. "అభిషేక్ నాయర్ 2018 నుంచి కేకేఆర్ సెటాప్‌లో భాగంగా ఉన్నాడు. ఎంతో మంది మా ఆటగాళ్లను అభిషేక్ తీర్చిదిద్దాడు. హెడ్ కోచ్‌గా అతడు మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నామని" వెంకీ మైసూర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా నాయర్ 2018 నుంచి కేకేఆర్ బ్యాక్ రూమ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ అకాడమీలో యువ ఆటగాళ్లను తాయారు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.

నాయర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. భారత జట్టు సహాయక కోచ్‌గా కూడా నాయర్ పనిచేశాడు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కారణంగా అసిస్టెంట్ కోచ్‌లపై వేటు వేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో నాయర్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 

ఆ తర్వాత ఐపీఎల్‌-2025లో కేకేఆర్‌  అసిస్టెంట్ కోచ్‌గా జాయిన్‌ అయ్యాడు. ఇప్పుడు కేకేఆర్‌ జట్టు ప్రధాన కోచ్‌గా కూడా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కాగా నాయ‌ర్ ఇటీవ‌లే  డబ్ల్యూపీఎల్ జట్టు యూపీ వారియర్స్ హెడ్ కోచ్‌గా కూడా ఎంపిక‌య్యాడు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)