Breaking News

రుతురాజ్ గైక్వాడ్‌తో క‌లిసి ఆడ‌నున్న పాక్ ఓపెన‌ర్‌..

Published on Mon, 06/16/2025 - 17:05

పాకిస్తాన్ స్టార్ ఓపెన‌ర్ అబ్దుల్లా షఫీక్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడ‌నున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2025-26లో  యార్క్‌షైర్ క్రికెట్ క్ల‌బ్ త‌ర‌పున రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ష‌ఫీక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో కూడా యార్క్‌షైర్ త‌ర‌పున నాలుగు మ్యాచ్‌లు ఆడ‌నున్నాడు.

ఈ విష‌యాన్ని ష‌ఫీక్ ధ్రువీక‌రించాడు. "యార్క్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌తో ఒప్పందం కుదుర్చుకువ‌డం చాలా సంతోషంగా ఉంది. నాటింగ్‌హామ్‌షైర్‌తో జ‌రిగే బిగ్ మ్యాచ్‌కు ముందు యార్క్‌షైర్ జ‌ట్టులో చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. హెడింగ్లీ వంటి అద్బతమైన వాతవారణం ఉన్న మైదానంలో ఆడేందుకు ఎల్లప్పుడూ నేను ఇష్టపడతాను. నా​​కు ఈ అవకాశం కల్పించిన యార్క్‌షైర్‌కు ధన్యవాదాలు" అని షఫీక్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

కాగా ఇదే యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు టీమిండియా ఓపెనర్‌, చెన్నై సూపర్ ​​కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రాతినిథ్యం వహించనున్నాడు. రాబోయే కౌంటీ సీజన్‌లో గైక్వాడ్‌, షఫీక్ కలిసి ఒకే జట్టుకు ఆడనున్నారు.  కాగా షఫీక్ 2021లో బంగ్లాదేశ్‌పై త‌న టెస్టు కెరీర్‌ను  ఘ‌నంగా ఆరంభించాడు. 

తన డెబ్యూ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసి ఆక‌ట్ట‌కున్నాడు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక‌ల‌పై కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. కానీ 2024లో మాత్రం ఈ పాక్ ఓపెన‌ర్ పేల‌వ ఫామ్‌తో సత‌మ‌త‌మ‌య్యాడు. గ‌తేడాది 6 టెస్టులు ఆడి కేవ‌లం 178 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో త‌న ఫామ్‌ను తిరిగి అందుకునేందుకు యార్క్‌షైర్‌తో జ‌త‌క‌ట్టాడు. ఓవ‌రాల్‌గా త‌న టెస్టు కెరీర్‌లో ష‌ఫీక్‌.. 1504 ప‌రుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు