Breaking News

డివిలియర్స్‌ మహోగ్రరూపం.. మరో విధ్వంకసర శతకం.. ఈసారి 39 బంతుల్లోనే..!

Published on Sun, 07/27/2025 - 18:39

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో (WCL) సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే భీకర ఫామ్‌లో ఉన్న ఏబీడీ.. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చాడు. 

కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఏబీడీతో పాటు మరో ఓపెనర్‌ జేజే స్మట్స్‌ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ​ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

ఏబీడీ-‍స్మట్స్‌ తొలి వికెట్‌కు 187 పరుగులు జోడించాక, సౌతాఫ్రికా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు జేపీ డుమిని (16), మోర్నీ వాన్‌ విక్‌ (3), హెన్రీ డేవిడ్స​ (1), వేన్‌ పార్నెల్‌ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్‌ సిడిల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రెట్‌ లీ, స్టీవ్‌ ఓకీఫ్‌, డేనియల్‌ క్రిస్టియన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

మూడు రోజుల వ్యవధిలో రెండో శతకం
WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్‌ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు.

ఈ టోర్నీలో ఏబీడీ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి చివరి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్‌ రద్దు చేసుకున్న  విషయం తెలిసిందే. 
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)