Breaking News

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ సీన్ రిపీట్‌.. బౌల్ అవుట్‌లో గెలిచిన సౌతాఫ్రికా

Published on Sun, 07/20/2025 - 09:52

2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్-పాకిస్తాన్‌ మ‌ధ్య జ‌రిగిన బౌల్‌-అవుట్‌ స‌గ‌టు క్రికెట్ అభిమాని ఎప్ప‌టికి మ‌ర్చిపోలేడు. టై అయిన మ్యాచ్‌లో బౌల్‌-అవుట్ నియ‌మం ద్వారా భార‌త్ విజ‌యం సాధించింది. ఇప్ప‌డు అచ్చెం అటువంటి సీన్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌-2025లో రిపీటైంది.

ఈ టోర్నీలో భాగంగా శ‌నివారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజ‌యం సాధించింది. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవ‌ర్ల‌కు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ‍క్రిస్‌ గేల్‌(2), పొలార్డ్‌(0) వంటి స్టార్‌ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్‌ సిమ్మన్స్‌(28) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్‌, స్మట్స్‌, ఓలీవర్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.

లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు బౌల్‌ అవుట్‌ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్‌లు చేయగా.. విండీస్‌ ఒక్క బౌల్డ్‌ కూడా చేయలేకపోయింది.

దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్‌ క్రికెట్‌ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.


 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)