తిలక్‌ హాఫ్‌ సెంచరీని అడ్డుకున్న హార్ధిక్‌.. కొట్టిపారేసిన హర్షా, ఏకీభవించిన ఏబీడీ

Published on Thu, 08/10/2023 - 21:30

విండీస్‌తో మూడో టీ20లో టీమిండియా యంగ్‌ గన్‌ తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీ (49 నాటౌట్‌) చేయకుండా కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా అడ్డుకున్నాడని (తిలక్‌ హాఫ్‌ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా హార్దిక్‌ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ ముగించాడు) సోషల్‌మీడియాలో పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హార్దిక్‌ను తప్పుబడుతూ చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు భారత మాజీలు సైతం ఈ విషయంలో అభిమానులతో ఏకీభవించారు.  

తాజాగా ఇదే విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. తిలక్‌ విషయంలో ఫ్యాన్స్‌ అభిప్రాయాన్ని అతను కొట్టిపారేశాడు. టీ20ల్లో హాఫ్‌ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్‌ మార్క్‌ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో సెంచరీ మినహా ఏదీ ల్యాండ్‌ మార్క్‌ కాదని తెలిపాడు. అసలు క్రికెట్‌ లాంటి టీమ్‌ గేమ్‌లో ల్యాండ్‌ మార్క్‌ల వ్యామోహం ఉండకూడదని అన్నాడు.

టీ20ల్లో హాఫ్‌ సెంచరీలు పరిగణలోకి తీసుకోవాలని అనుకోనని తెలిపాడు. ఈ ఫార్మాట్లో ఎంత వేగంగా పరుగులు చేశామనేది ముఖ్యమని పేర్కొన్నాడు. తిలక్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌ అయిన విషయంలో హర్షా అభిప్రాయంతో దిగ్గజ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఏకీభవించాడు. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ హర్షాను సమర్ధిస్తూ ట్వీట్‌ చేశాడు. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)