Breaking News

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ విధ్వంసం... ఓకే ఓవర్‌లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్‌

Published on Tue, 08/22/2023 - 14:02

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అడితో ఏ మాత్రం పవర్‌ తగ్గలేదు. ఫించ్‌ ప్రస్తుతం యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కాలిఫోర్నియా నైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం న్యూజెర్సీ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.  కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఫించ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తన జట్టు మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కాలిఫోర్నియా బ్యాటర్లలో ఫించ్‌తో పాటు మిలాంద్‌ కుమార్‌(27) పరుగులతో రాణించాడు.

అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్‌ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓ‍వర్లలో ఛేదించింది. న్యూజెర్సీ బ్యాటర్లలో  టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్‌ ఓజా(25) పరుగులతో రాణించాడు.
చదవండి: MS Dhoni- Rohit: ఆరోజు రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు.. వెంటనే కోచ్‌ కూడా! మేమేం చేయలేకపోయాం..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)