Breaking News

శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం..

Published on Sat, 03/16/2024 - 15:57

శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావేద్‌ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకు జావేద్‌ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెర​కు శ్రీలంక క్రికెట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

"పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌‍కప్‌-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్‌ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టుకు జావేద్‌ బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా

అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌లలో కూడా జావేద్‌ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్‌ తరపున 163, 22  వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్‌ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ గెలుచుకున్న పాక్‌ జట్టులో జావేద్‌ సభ్యునిగా ఉన్నాడు.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు