Breaking News

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే..! రూ. 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌

Published on Fri, 03/13/2026 - 16:45

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్‌ చేసింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత సీజన్‌ మాదిరిగానే ఓపెనర్లగా అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌లను అతడు ఎంపిక చేశాడు. అదేవిధంగా మూడో స్ధానంలో పాకెట్‌ డైనమెట్‌ ఇషాన్‌ కిషన్‌కు అవకాశమిచ్చాడు.

ఆ తర్వాత వరుసగా నాలుగు ఐదు స్దానాల్లో క్లాసెన్,నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాన్స్‌ ఇచ్చాడు. అయితే ఐపీఎల్‌ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌కు ప్రధాన ఆల్‌రౌండర్‌గా చోప్రా చోటు కల్పించాడు. ఏడో స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్‌గా అతడు తీసుకున్నాడు. 

కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో కమ్మిన్స్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్ ,శివమ్ మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్‌గా జీషన్‌ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే రూ.8 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ను ఆకాష్‌ చోప్రా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టు ఇదే
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి
చదవండి: IPL 2026: 'ధోని, రుతురాజ్‌ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్‌ బోన్‌'

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి