Breaking News

ఉతికారేసిన గుర్బాజ్‌.. సెంచరీతో పలు రికార్డులు బద్దలు!

Published on Sat, 06/13/2026 - 20:58

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్‌లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్‌ బౌలింగ్‌కు వచ్చిన ప్రతీ భారత బౌలర్‌ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.

👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డే‍ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్‌పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్‌పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్‌పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్‌పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

👉ఇక వన్డేల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్‌వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

👉వన్డేల్లో గుర్బాజ్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్‌, మొహమ్మద్ షెహజాద్‌లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్‌.. గతంలో 2021లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్‌పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్‌పై 7 సిక్సర్లు కొట్టాడు.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)