Breaking News

విధ్వంసం సృష్టించిన రుతురాజ్‌.. వీడియో

Published on Tue, 08/26/2025 - 20:47

తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సీఎస్‌కే సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపు సెంచరీతో మెరిశాడు. హిమాచల్‌ ప్రదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 144 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ బాదిన నాలుగు సిక్సర్లు వరుస బంతుల్లో బాదినవి కావడం​ విశేషం. అమన్‌ జైన్వాల్‌ అనే బౌలర్‌ వేసిన ఓ ఓవర్‌లో రుతురాజ్‌ ఈ ఘనత సాధించాడు. రుతురాజ్‌ వరుస సిక్సర్లు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

ఈ వీడియో చూసి సీఎస్‌కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రుతురాజ్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఆ సీజన్‌లో రుతురాజ్‌ మెరుపులు మిస్‌ అయ్యారు. తమ కెప్టెన్‌ టచ్‌లోకి రావడంతో వారి ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.

హిమాచల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్‌ క్లాసికల్‌ సెంచరీ బాది తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. మరో సెంచరీ వీరుడు అర్షిన్‌ కులకర్ణితో (146) కలిసి 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్‌.. ఆతర్వాత ఎదుర్కొన్న 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

రుతురాజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భారత-ఏ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశాలు రాలేదు. అనంతరం రుతు ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడేందుకు యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. బుచ్చిబాబు టోర్నీలో రుతురాజ్‌ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఛత్తీస​్‌ఘడ్‌పై 1, 11 పరుగులు మాత్రమే చేశాడు.

రుతురాజ్‌ త్వరలో దులీప్‌ ట్రోఫీలో కనిపించనున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ లాంటి చాలా మంది టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్‌ జోన్‌కు ఆడనున్నాడు. 
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు