Breaking News

స్టీవ్‌ స్మిత్‌ అద్భుత శతకం.. పట్టు సాధించిన ఆస్ట్రేలియా

Published on Tue, 01/06/2026 - 12:40

ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మరో సెంచరీతో మెరిశాడు. యాషెస్‌ సిరీస్‌ 2025-26లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్‌) ఈ ఫీట్‌ను సాధించాడు. స్టీవ్‌కు టెస్ట్‌ల్లో ఇది 37వ శతకం. ఇంగ్లండ్‌పై 13వది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 49వది.

సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టీవ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 129 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా బ్యూ వెబ్‌స్టర్‌ (42) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్‌ స్కోర్‌ 7 వికెట్ల నష్టానికి 518 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై ఆసీస్‌ 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌ (163) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మిగతా బ్యాటరల్లో వెదర్లాడ్‌ 21, లబూషేన్‌ 48, మైఖేల్‌ నెసర్‌ 24, కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న ఉస్మాన్‌ ఖ్వాజా 17, అలెక్స్‌ క్యారీ 16, గ్రీన్‌ 37 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో కార్స్‌ 3, స్టోక్స్‌ 2, టంగ్‌, బేతెల్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. జో రూట్‌ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్‌ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్‌‌ బౌలర్లలో నెసర్‌ 4, స్టార్క్‌, బోలాండ్‌ తలో 2, గ్రీన్‌, లబూషేన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు