Breaking News

IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భార‌త తుది జ‌ట్టు ఇదే

Published on Mon, 07/08/2024 - 13:24

హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన రెండో టీ20లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్ద‌మ‌వుతోంది. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక‌గానే మూడో టీ20లో జింబాబ్వేతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాల‌ని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు భార‌త తుది జట్టు ఎంపిక చేయ‌డం శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20ల‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్ కార‌ణంగా య‌శ‌స్వీ జైశ్వాల్‌, సంజూ శాంస‌న్‌, శివ‌మ్ దూబే దూర‌మైన సంగ‌తి తెలిసిందే.  

వారి స్ధానంలో  సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది.  అయితే ఇప్పుడు  జైశ్వాల్‌, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జ‌ట్టుతో చేరారు. వీరి రావ‌డంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జ‌ట్టును వీడ‌నున్నారు.

ఈ క్ర‌మంలో జ‌ట్టు కూర్పు కొంచెం క‌ష్టంగా మారింది. అభిషేక్ శ‌ర్మ ఓపెన‌ర్‌గా దుమ్ములేపుతుండ‌డంతో జైశ్వాల్ మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. 

తొలి మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికి తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిపై వేటు వేయాల‌ని జ‌ట్టు మెనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇక రెండో టీ20కు జ‌ట్టులోకి వ‌చ్చిన సాయిసుద‌ర్శ‌న్ స్ధానంలో ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు.

జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) 
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్‌, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)