Breaking News

హార్దిక్‌ ఒక్కడే కాదు.. గతంలోనూ కెప్టెన్ల ట్రేడింగ్! ఎవరెవరంటే?

Published on Mon, 11/27/2023 - 16:29

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే సంచలనాలు నమోదు అవుతున్నాయి.  ఈ ఐపీఎల్‌-17వ సీజన్‌కు వేలానికి ముందు ఓ అనుహ్య మార్పు చోటు చేసుకుంది.  గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌, టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి చేరాడు. క్యాష్‌ ట్రేడింగ్‌ ద్వారా గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

తొలి రెండు సీజన్లలో గుజరాత్‌ను ఓ సారి ఛాంఫియన్స్‌గా.. మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్‌ పాండ్యా అనూహ్యంగా ఫ్రాంచైజీ మారడంపై క్రికెట్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. 2015 సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో వేలంలో అతడినికి కనీస ధర రూ.10లక్షలకు ముంబై కొనుగోలు చేసింది.

ఆ తర్వాత 6 సీజన్‌ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్‌ను.. ఐపీఎల్‌-2022 వేలానికి ముందు ముంబై  ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.15 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో అరంగేట్ర సీజన్‌లోనే తన జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ట్రేడింగ్‌ ద్వారా కెప్టెన్‌ ఫ్రాంచైజీ మారడం ఇదేమి తొలిసారి కాదు. హార్దిక్‌ కంటే ముందు మరో ఇద్దరు కెప్టెన్లు క్యాష్‌ ట్రేడింగ్‌ ద్వారా ఫ్రాంఛైజీలు మారారు. 

ఎవరెవరంటే?
అజింక్యా రహానే.. 
ట్రేడింగ్‌ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్‌ టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానే. ఐపీఎల్‌-2020 సీజన్‌కు ముందు రాజస్తాన్‌ నుంచి రహానేను ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రేడ్‌ చేసుకుంది. ఐపీఎల్‌-2011లో రాజస్తాన్‌ రాయల్స్‌కు రహానే  సారథ్యం వహించాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌..
ఈ లిస్ట్‌లో రహానే తర్వాతి స్ధానంలో భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఉన్నాడు. అశ్విన్‌ను ఐపీఎల్‌-2020 సీజన్‌కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రేడింగ్‌ ద్వారానే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి హార్దిక్‌ కూడా చేరాడు.
 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)