వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూత

Published on Sat, 07/19/2025 - 10:03

న్యూఢిల్లీ: భారత్‌ 2036 ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆ విశ్వక్రీడల నాటికి భారత్‌ పతకాల పట్టికలో టాప్‌–5లో నిలవడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ పోలీస్‌–ఫైర్‌ క్రీడల్లో పతకాలతో సత్తా చాటిన భారత బృంద సభ్యులను కేంద్ర మంత్రి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమిత్‌ షా పతక విజేతలకు నజరానా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు ప్రాథమిక బిడ్డింగ్‌లో పాల్గొన్నాం. 

ఒలింపిక్స్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉంది. అలాగే ఈ పోటీల కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పతకాలు గెలవగలిగే  3000 మంది ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి నెలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక చేయూతతో విశ్వక్రీడలకు దీటుగా తయారుచేస్తాం’ అని అన్నారు.

ఇదీ చదవండి: భారత్‌ శుభారంభం
సొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 110–69 పాయింట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. గ్రూప్‌ ‘డి’లో శుక్రవారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ పది మ్యాచ్‌లు గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విష్ణు కోడె–రిషిక జోడీ 11–5తో కెనెత్‌ అరుగొడ–ఇసురి అటనాయకె జంటపై గెలుపొందగా, మహిళల సింగిల్స్‌లో గాయత్రి–మానస రావత్‌ 11–9తో సితుమి డిసిల్వా–ఇసురి అటనాయకెలపై గెలిచారు. సింగిల్స్‌లో తన్వీ శర్మ 11–7తో సితులి రణసింఘేపై గెలిచింది. మిగతా మ్యాచ్‌ల్లోనూ భారత షట్లర్లే గెలుపొందడంతో గరిష్ట 110 పాయింట్లతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగే తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత బృందం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో తలపడుతుంది.    

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)