Breaking News

చరిత్ర సృష్టించిన సికందర్‌ రజా.. కోహ్లి రికార్డు సమం

Published on Tue, 11/28/2023 - 13:52

టీ20 వరల్డ్‌కప్‌ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్‌ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్‌) సికందర్‌ రజా చరిత్ర సృష్టించాడు.  జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో రజా విరాట్‌ రికార్డును (6) సమం చేశాడు.

ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది.

కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్‌ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్‌ బర్ల్‌ (44 నాటౌట్‌) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్‌ నగరవ (3/11), సికందర్‌ రజా (3/3), ర్యాన్‌ బర్ల్‌ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు