Breaking News

2023 రౌండప్: భారత క్రీడారంగంలో కీలక ఘట్టాలు

Published on Fri, 12/29/2023 - 17:38

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్‌ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, క్రికెట్, చెస్‌, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్‌ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు..

  • వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్‌, 38 సిల్వర్‌, 41 బ్రాంజ్‌)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 
  • రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు.
  • చరిత్ర సృస్టించిన సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి-చిరాగ్‌ షెట్టి.. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు.
  • తొమ్మిదోసారి SAFF చాంపియన్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్‌ జట్టు. కువైట్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్‌కప్‌ రౌండ్‌-2కు అర్హత.
  • భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్‌ నంబర్ వన్ జట్టుగా అవతరణ. 
  • టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు.
  • వన్డే ప్రపంచకప్‌లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. 
  • చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్‌ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్‌, 31 సిల్వర్‌, 51 బ్రాంజ్‌) సొంతం. ఈ పోటీల్లో భారత్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
  • అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్‌ టైటిల్‌ను సాధించిన అదితి స్వామి
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది.  ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. 
     

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)