Breaking News

August 18.. క్రికెట్‌ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రోజు

Published on Mon, 08/18/2025 - 15:29

ఆగస్ట్‌ 18.. భారత్‌ క్రికెట్‌కు సంబంధించి ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజు భారత్‌ క్రికెట్‌ దిగ్గజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 17 ఏళ్ల కిందట (2008) ఈ రోజున విరాట్‌ కోహ్లి అనే ఢిల్లీ కుర్రాడు జెంటిల్మెన్‌ గేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో క్రికెట్‌ అభిమానులకు పరిచయమయ్యాడు. అనంతరం 2010 జూన్‌ 12న జింబాబ్వేపై టీ20 అరంగేట్రం.. మరుసటి ఏడాది (2011) జూన్‌ 20న వెస్టిండీస్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేశాడు.

కెరీర్‌ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా, ఆతర్వాత విరాట్‌ ఏం చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. విరాట్‌ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తూ ఎన్నో ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులను సృష్టించాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌కు.. ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

ఆగస్ట్‌ 18.. ఈ రోజు భారత్‌ మరో స్టార్‌ బ్యాటర్‌ను  ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేసింది. 2018లో ఈ రోజున చిచ్చరపిడుగు రిషబ్‌ పంత్‌ టీమిండియా తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. గడిచిన ఏడేళ్లలో పంత్‌ టెస్ట్‌ల్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు అపురూప విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనలోనూ ఇదే జరిగింది. అయితే ఈ పర్యటనలో పంత్‌ చివరి టెస్ట్‌కు ముందు గాయపడి సిరీస్‌ నుంచి వైదొలిగాడు.

టెస్ట్ అరంగేట్రానికి ముందే పంత్‌ టీ20 ఫార్మాట్‌ ద్వారా భారత క్రికెట్‌కు పరిచయమయ్యాడు. 2017 ఫిబ్రవరి 1న పంత్‌ ఇంగ్లండ్‌తో టీ20తో పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్‌ అరంగేట్రం తర్వాత అదే ఏడాది అక్టోబర్‌ 21న పంత్‌ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడు ఫార్మాట్లలో స్థిరపడిన పంత్‌ మధ్యలో కారు ప్రమాదం కారణంగా కొద్ది కాలం ఆటకు దూరమైనా, ఆతర్వాత తిరిగి జట్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు.

ఆగస్ట్‌ 18 భారత్‌ క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగును పరిచయం​ చేసింది. 2023లో ఈ రోజున విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌ మెరుపుల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రింకూ.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ద్వారా టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్‌ 19 రింకూ వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే వన్డేల్లో రింకూ కేవలం 2 మ్యాచ్‌లకు మాత్రమే పరిమితయ్యాడు. 

తన ఆటతీరు సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిపోదు కాబట్టి, రింకూ టెస్ట్‌ అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడుతూ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదడంతో రింకూ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఆ మ్యాచ్‌లో రింకూ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించడంతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఆకర్శించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)