Breaking News

IPL 2023: ‘రన్‌’రంగం రె‘ఢీ’... ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ విశేషాలు

Published on Thu, 03/30/2023 - 00:41

కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్‌లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తిస్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్‌ జట్లు సిద్ధమయ్యాయి. 

శుక్రవారం అహ్మదాబాద్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్‌ 16వ సీజన్‌కు తెర లేవనుంది. మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌ దశలో 70 మ్యాచ్‌లు ఉండగా... ప్లే ఆఫ్‌ దశలో నాలుగు మ్యాచ్‌లతో (క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2, ఫైనల్‌) టోర్నీ ముగుస్తుంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు జైపూర్‌తోపాటు గువాహటిలో... పంజాబ్‌ కింగ్స్‌ జట్టు మొహాలితోపాటు ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు ఆడతాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్‌లో ఇంటా, బయటా పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్‌లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారు. 

నోట్‌: ప్లే ఆఫ్‌ (క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2) మూడు మ్యాచ్‌ల తేదీలను, వేదికలను తర్వాత  ప్రకటిస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరుగుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ వేదికను కూడా తర్వాత ప్రకటిస్తారు. 

మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్స్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)