Breaking News

పాక్‌-భార‌త్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెక‌న్లకు రూ.16 ల‌క్ష‌లు!

Published on Sun, 08/17/2025 - 17:47

వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవ‌ల‌రీల‌లో  భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ ఒక‌టి. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి క‌ళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న రాజకీయాల ఉద్రిక్త‌ల కారణంగా రెండు జ‌ట్లు కేవ‌లం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు మాత్ర‌మే త‌ల‌ప‌డ‌తున్నాయి.

దీంతో  ఈ చిరకాల ప్ర‌త్య‌ర్ధుల పోరు రోజున‌ యావ‌త్తు క్రికెట్ ప్ర‌పంచం టీవీల‌కు అతుక్కుపోతారు. అయితే అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించే స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. ఈ చిరకాల ప్ర‌త్య‌ర్ధిలు మ‌రోసారి అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు.

ఆసియాక‌ప్‌-2025లో భాగంగా సెప్టెంబ‌ర్ 14న దుబాయ్ వేదిక‌గా పాక్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజును సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) భారీగా క్యాష్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆసియాక‌ప్‌లో భార‌త్ ఆడే మ్యాచ్‌ల స‌మ‌యంలో ప‌ది సెక‌న్ల సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు సోనీ నెట్‌వ‌ర్క్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. భార‌త్‌-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా ఇదే ధ‌ర వ‌ర్తించనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా 2031 వరకు ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాల‌ర్ల(భార‌త కరెన్సీలో వెయ్యి కోట్ల పైగా)కు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ లివ్‌లో యాప్‌లో కూడా ప్రసారం కానున్నాయి.

ఇక 8 మ్యాచ్‌లు పాల్గోనే ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసియాకప్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును వెల్లడించనుంది.

ఆసియా కప్‌-2025 కోసం పాక్‌ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సైమ్‌ అయూబ్‌, సల్మాన్‌ మీర్జా, షాహీన్‌ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్

ఆసియాకప్‌-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, జితేశ్‌ శర్మ

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)