కింగ్ కోబ్రానే గడగడలాడించిన పిల్లి..!

Published on Sun, 07/26/2026 - 11:14

పాము–ముంగిసల పోరాటాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ ఓ చిన్న పిల్లి ఏకంగా కింగ్ కోబ్రానే వెనక్కి తగ్గేలా చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడగ విప్పి దాడికి దిగిన కింగ్ కోబ్రాను పిల్లి చాకచక్యంగా ఎదుర్కొన్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

'ఘర్ కే కలేష్' అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  కింగ్ కోబ్రా, చిన్న పిల్లి ఎదురెదురుగా నిలుస్తాయి. పిల్లిని గమనించిన వెంటనే కింగ్ కోబ్రా పడగ విప్పి దాడికి సిద్ధమవుతుంది. అయితే సాధారణంగా జరిగేదానికి భిన్నంగా పిల్లి ఏమాత్రం భయపడకుండా పాము ముందే ధైర్యంగా నిలబడుతుంది.

ఒక్కసారిగా కోబ్రా కాటు వేయడానికి ముందుకు దూసుకురాగా, పిల్లి మెరుపు వేగంతో తప్పించుకుని వెంటనే తన పంజాతో ఎదురుదాడి చేస్తుంది. పిల్లి చూపిన చురుకుదనం, ధైర్యానికి కింగ్ కోబ్రా కూడా వెనక్కి తగ్గి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది.

ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 48 వేలకుపైగా వీక్షణలు లభించగా, పిల్లి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)