ఆ హీరోయిన్‌ సినిమా చేయనంది.. నేనే బలవంతంగా..

Published on Sat, 03/30/2024 - 17:12

ఇరవై రెండేళ్ల తరువాత అళగి చిత్రయూనిట్‌ అంతా మళ్లీ ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్‌ లవ్‌స్టోరీ అళగి. నటుడు పార్తీపన్‌, దేవయాని, నందితాదాస్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్‌ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్‌ పతాకంపై ఉదయకుమార్‌ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. 

అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్‌ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్‌, దేవయాని, నిర్మాత ఉదయకుమార్‌, ఇతర నటీనటులు పాల్గొన్నారు.

నటి దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్‌ అడిన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచడానికి అంగీకరించకపోయే మహిళ పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.

పార్తీపన్‌ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్‌ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరెవరైనా అయితే ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్‌ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్‌ తనతో చెప్పారన్నారు. అయితే తాను ఆమెకు చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేందుకు ప్పింన్నారు.

కాగా అళగి చిత్రానికి సీక్వెల్‌ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్‌ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడపోతే తాను అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)