Breaking News

తరాలు మారి.. అంతరాలు పెరిగి..

Published on Mon, 06/16/2025 - 05:18

ఈ తరం యువతకు, నిన్నటి తరం వయోధికులకు నడుమ దూరం పెరుగుతోంది. పెద్దవాళ్లను బాగా చూసుకోవడమంటే వాళ్లకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడం, సమయానికి మందులు, భోజనం వంటివి అందజేయడమే అనే భావన పెరిగిపోతోంది. తమ భావోద్వేగాలను పిల్లలతో పంచుకోవాలని పెద్దలు ఆశిస్తుండగా, యువత మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా హెల్పేజ్‌ ఇండియా ‘ప్రస్తుత డిజిటల్‌ యుగంలో వృద్ధాప్యంపై యువత దృక్కోణం’అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో యువత, వయోధికుల అభిప్రాయాలను సేకరించారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 5,798 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.  

సర్వేలోని ముఖ్యాంశాలు..
⇒ సర్వేలో వృద్ధాప్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 56 శాతం యువత ‘ఒంటరితనం’అని, మరో 48 శాతం ‘ఇతరులపై ఆధారపడేవారు’అని బదులిచ్చారు. అపార అనుభవం కలిగినవారు అని 51 శాతం యువత పేర్కొనగా, ‘గౌరవించవలసిన వాళ్లు’అని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు.  
⇒ సర్వేలో పాల్గొన్న వయోధికుల్లో 54 శాతం మంది తాము ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పారు. 47 శాతం మంది తమ బాధలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. 

⇒ ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు మధ్య అనుబంధాలు కొంతవరకు బలంగానే ఉన్నాయి. 49 శాతం యువత తమ తాత, ముత్తాతలతో ఎక్కువ సమయం గడుపుతున్నామని చెప్పారు. 50 శాతం మంది వృద్ధులు తమ కొడుకులతో ఎక్కువ అనుబంధాన్ని, 40 శాతం మంది తమ మనవళ్లతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నామని వెల్లడించారు.  
⇒ చిన్న కుటుంబాల్లో వయోధికులకు సముచితమైన గౌరవం లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం వయోధికుల్లో 46 శాతం మంది కుటుంబం తమ మాట వింటుందని, మరో 28 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే వింటుందని తెలిపారు.  

⇒71 శాతం వృద్ధులు సాధారణ మొబైల్‌ ఫోన్లు వాడుతుండగా, 13 శాతం మంది కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సేవలను వినియోగిస్తున్నట్లు తేలింది. 66 శాతం వయోధికులు మొబైల్‌ ఫోన్‌ను ‘సాంకేతిక గందరగోళం’గా భావిస్తున్నారు. 
⇒ 51 శాతం యువత, 45 శాతం వయోధికులు తరాల మధ్య అతిపెద్ద అంతరం ఉన్నట్లు పేర్కొన్నారు. 57 శాతం యువత, 49 శాతం వయోధికులు మాత్రం మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చుననే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. 
⇒ సర్వేలో పాల్గొన్న 86 శాతం వయోధికులు కుటుంబమే తమకు అండగా ఉందని తెలిపారు.

సంతోషకరమైన వృద్ధాప్యం కావాలి 
జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనివార్యమైన దశ. పెద్దలను అర్ధం చేసుకోవడంలో యువత విఫలం కావడం వల్ల చాలామంది వయోధికులు సంతోషకరమైన వృద్ధాప్యానికి దూరమవుతున్నారు. కుటుంబ సంబంధాలు బలోపేతంగా ఉంటేనే ఆ సంతోషం లభిస్తుంది. – శ్యామ్, స్టేట్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్, హెల్పేజ్‌ ఇండియా 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)