భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
బీసీ సంక్షేమ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ
Published on Sat, 06/03/2023 - 02:16
టంగుటూరు: జిల్లాలోని కొండపి (బాలురు), మార్కాపురం (బాలికలు), కనిగిరి (బాలికలు), దరిమడుగు (బాలురు)ల్లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్టున్నట్లు జిల్లా గురుకులాల కన్వీనర్ కె.రాజారావు టంగుటూరులో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిషు మీడియంలో 6, 7, 8, 9 తరగతుల్లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న సీట్లను నింపేందుకు జూన్ 3 నుంచి 9 వరకు విద్యార్థులు రెండు కలర్ ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకొచ్చి దరఖాస్తులు అందించాలన్నారు. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువుతూ ఉండాలని, వారి కుటుంబ వార్షిక ఆదాయం ఆదాయం ఒక రూ.లక్షకు మించరాదని చెప్పారు. విద్యార్థులను జూన్ 12వ తేదీ జరిగే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, ప్రస్తుత 2023–24 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన తరగతిలో మాత్రమే చేరుస్తారన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 9వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించి, 12న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరిగే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలన్నారు. వివరాలకు టంగుటూరు (బాలురు) సెల్: 9515121249, మార్కాపురం (బాలికలి) సెల్: 9515411954, దరిమడుగు (బాలురు) సెల్: 7286969849, కనిగిరి (బాలికలు) సెల్: 9441130614 నంబర్లను సంప్రదించాలన్నారు.
Tags : 1